Tuesday, November 19, 2024

భక్తులు అవస్థలు పడుతుంటే … టీటీడీ ఏం చేస్తోంది : చంద్ర‌బాబు

వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే.. తితిదే ఏం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ప్రశ్నించారు. తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పడుతున్న కష్టాలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు తాగునీరు, క్యూలైన్లలో నీడ ఉండేలా చూడలేరా అని నిలదీశారు. టీటీడీ నిర్ణయాలతో శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనాలు, వసతి వంటి అంశాల్లో మొదటి నుంచి ఇదే తరహా అలసత్వం తితిదేలో కనిపిస్తోందన్నారు. తిరుమల లాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణంలోనే టీటీడీ చూస్తోందని విమర్శించారు. కొండపైకి వెళ్లడానికి కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని దుయ్యబట్టారు. భక్తులకు టీటీడీ క్షమాపణలు చెప్పి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement