విజయవాడ – బెజవాడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.. అప్పుడే పుట్టిన పాపను చెత్త కుప్పలో వదిలేసిందో తల్లి… విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలోని సాయిబాబా గుడి సమీపంలో ఉన్న చెత్తలో అప్పుడే పుట్టిన పాప స్థానికులకు కనిపించింది.
తెల్లవారుజామున ఏడుపులు విడిపించడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పాపను రక్షించారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ఏ వివరాలు తెలియకపోవడంతో పాపను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి జాడ కోసం సీసీ టీవీ కెమెరాలలోని వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు..
- Advertisement -