ఉండ్రాజవరం, ఫిబ్రవరి 10, (ప్రభ న్యూస్) : గ్రామీణ, పేద విద్యార్థులను భవిష్యత్ గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు సీఎం జగన్ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్ సౌకర్యాలు కల్పిస్తున్నారని, నేడు చదువుల కార్పోరేట్ స్థాయిలో ఉన్నాయని నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు అన్నారు. మండలంలోని చివటం, వేలివెన్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న టాబ్ లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభ శైలిలో అర్థమయ్యేలా మెరుగైన ఒత్తిడి లేని చదువులు దిశగా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి, టాబ్ ల పంపిణీతో పాటు, ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ లు పంపిణీ చేస్తూ ఆఫ్ లైన్ లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరచడానికి జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, పాఠశాలలో నాడు-నేడు, వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల, విద్య పట్ల తనకున్న తపన తెలియజేస్తున్నారని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి, జెడ్పీటీసీ నందిగం భాస్కర రామయ్య, చివటం పీఏసీఎస్ అధ్యక్షులు కొఠారు సత్యనారాయణ, మండల వైసీపీ నాయకులు పాలాటి శరత్ బాబు, విద్యాకమిటీ చైర్మన్లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండల విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.