ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఇప్పటివరకు జిల్లాలో 1458 ఫోన్లకు గాను 821 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. స్థానిక ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆమె సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి సెల్ ఫోన్ రికవరీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెల్ ఫోన్ నేరస్తులు, అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులు ప్రతిరోజు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బ్యాంకులు, ఏటీఎంలు, రైతు బజార్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రజల అప్రమత్తత లేకపోవడం వల్ల మొబైల్ దొంగలించడం జరుగుతుందన్నారు. ప్రజలు వారి సెల్ ఫోన్ ల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ ల గోప్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలన్నారు. యాప్ లకు బలమైన పాస్వర్డ్ ను పెట్టుకోవాలన్నారు. ఐఎంఈఐ ఆధారిత సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, టాబ్లెట్లు మొదలైన వాటిని సరైన బిల్లు పత్రాలు, ఐడిలు లేకుండా అనుమతించకూడదని, అన్ని మొబైల్ దుకాణాలను మరమ్మతు దుకాణాలు యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిఎస్పి పైడేశ్వరరావు, ఎస్ బి సి ఐ సుబ్బారావు, సిసిఎస్ సీఐ మురళీకృష్ణ, సైబర్ సెల్ ఎస్సై మధు వెంకటరాజా, సిసిఎస్ ఏఎస్ఐ రాజకుమార్, హెచ్ సి ఆర్ ఎన్ వి మల్లేశ్వరరావు, హెచ్ సి లక్ష్మణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement