Tuesday, November 26, 2024

Eluru: రెండో రోజు కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల నిరసన

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ప్రైమ్ 2.0ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా దస్తావేజు లేఖరులు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రైమ్ 2.0 వల్ల దస్తావేజులు లేఖర్ల కుటుంబాలు వీధిన పడతాయని దస్తావేజుల లేఖర్ల రాష్ట్ర అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు తెలిపారు. కక్షిదారులకు దస్తావేజు లేఖరులు లేకపోవడం వల్ల నేరుగా వారికి స్లాట్లు బుక్ చేయడం వల్ల ఆస్తికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన రిజిస్ట్రేషన్ లేకపోతే బ్యాంకుల ద్వారా లోన్లు కూడా రావని తెలిపారు.

దీనివల్ల కక్షిదారులు కూడా ఇబ్బందులు పడతారని అన్నారు. దీనివల్ల లాభనష్టాలపై పరిశీలన చేసి దానిపై తగు చర్యల నిమిత్తం ముందుకు సాగుతామన్నారు. ప్రస్తుతానికి రెండు రోజులు పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం నుండి వచ్చే స్పందనపై తదుపరి కార్యచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు గారపాటి వీరాస్వామి, వైట్ అండ్ వైట్ నాయుడు, లింగి శెట్టి సతీష్ బాబు, యూ పాపారావు, రాము, జియావుద్దీన్, వంకాయలు బుజ్జి, నరేష్, హనుమంతరావు, డి ఎన్ వి ప్రసాద్, సిహెచ్ వి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement