ఏలూరు టౌన్ : ఏలూరు జిల్లా ఏలూరు డిపోలో విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వర రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏలూరు డిపోలో ఏప్రిల్ నెల ఆదర్శ ఉద్యోగులకి పురస్కారాలు అందించారు. అధిక డీజిల్ ఆయిల్ తీసుకువచ్చిన ఉత్తమ డ్రైవర్లు, అధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లకి, మెకానిక్ లకు ప్రశంసా పత్రం, పుష్ప గుచ్చం, దుశ్వాలువా, నగదు పురస్కారం అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ప్రయాణికులకి అనుగుణంగా మంచి సేవలు అందించాలని ప్రేమ, ఆత్మీయతతో ఆదరించాలని.. కోరిన చోట ఎక్కించుకొని, కోరిన చోట దింపాలని తెలియజేశారు. అదేవిధంగా పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మూడు డిపోలోను అనేక సర్వీసులు పెంచామని ప్రయాణికులకు అనుగుణంగా కేవలం పది రోజుల్లో ఏలూరు నుండి విజయవాడకి ఏసీ నాన్ స్టాప్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏలూరు పాత బస్టాండ్ లో ఫ్యాన్లు, ప్రయాణికులకి టైమింగ్ బోర్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. కోవిడ్ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ పుంజుకుంటోందని అన్ని డిపోల లోను ప్రతి ఒక్క బస్సుని ప్రయాణికులు సేవకు ఉపయోగిస్తామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement