ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈనెల 14వ తేదీ నుండి 25వ తేదీ వరకు దసరా సెలవులు మంజూరు చేసింది. ఈ దసరా సెలవుల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. అయితే ఏలూరు ప్రాంతంలో ఒకటో పట్టణంలో ఉన్న శ్రీ భారతి విద్యాసంస్థలు యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి సిలబస్ అవ్వలేదంటూ పదవ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరుగుతుంది.
దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా.. తాము ఎటువంటి ప్రైవేట్ క్లాసులకు అనుమతి ఇవ్వలేదని అలా నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన శ్రీ భారతి విద్యాసంస్థ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.