రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నరసాపురం ప్రాంతీయ వైద్యశాఖ నూతన భవనంతో పాటు మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఏపీ ఆక్వా వర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ తో పాటు రూ.1400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేయనున్నారు.కాగా రెండు దశల్లో ఆక్వా వర్సిటీ పనులు జరగనున్నాయి. దీంతో మత్స్యకారులు, ఆక్వా రైతులకు రూ.5 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.అనంతరం 1,623 మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement