Friday, November 22, 2024

Eluru: నిషేధిత తెలంగాణ మద్యం ఆంధ్రలో స్వాధీనం

పెదపాడు, సెప్టెంబర్ 29 (ప్రభ న్యూస్) : ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పన్న వీడు గ్రామంలో నిషేధిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యాన్ని ఒక ఇంట్లో ఉందన్న విషయాన్ని తెలుసుకున్న పెదపాడు పోలీసులు శుక్రవారం మెరుపు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

అప్పనవీడు గ్రామానికి చెందిన దేవన బోయిన సురేష్ కు చెందిన నివాస గృహంలో తెలంగాణ రాష్ట్రం నుంచి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేందుకు నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 59 మాన్షన్ హౌస్ మద్యం బాటిళ్లతో పాటు నిందితుడైన దేవన బోయిన సురేష్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పెదపాడు పోలీసులు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ ఎంత ఉంటుంది ? ఇందులో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement