Monday, November 18, 2024

ఏలూరులో టీడీపీ నాయకుడిపై దాడి

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇటీవలే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను మర్చిపోకముందే ఏలూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడిపై దాడి జరిగింది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కొల్లివారిగూడెంలో టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షుడు బేతిన వెంకట్రావుపై అదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి దాడి చేసినట్లు స్థానిక టీడీపీ నాయకులు వెల్లడించారు. తలకు బలమైన గాయమైన వెంకట్రావును హుటాహుటిన ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వెంకట్రావును టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, చింతలపూడి నియోజకవర్గ నేత గంటా మురళి, నియోజకవర్గ పార్టీ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement