Tuesday, November 26, 2024

Eluru: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చ‌ర్య‌లు.. డీఈఓ

ఏలూరు : దసరా సెలవుల నేపథ్యంలో ఈరోజు నుండి 24వ తేదీ వరకూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఏలూరు జిల్లా ఏలూరు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, పలు కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ప్రైవేటు విద్యా సంస్థలు సైతం నడుచుకోవాల్సిందేనని, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా సిలబస్ పూర్తి కాలేదనే నెపంతో, స్టాఫ్ మీటింగ్, వర్క్ షాప్, రిజిస్టర్ వర్క్ పేరుతో అదనపు తరగతులు నిర్వహిస్తే… అలా నిర్వహించిన పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాంసుంద‌ర్ తెలిపారు. జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు అందిన మరుక్షణం ఆ ప్రైవేట్ విద్యాసంస్థపై ప్రభుత్వ నిబంధనలు పాటించక పోవడాన్ని గుర్తించి అవసరమైతే ఆ ప్రైవేట్ విద్యాసంస్థ అనుమతిని రద్దు చేయబడుతుందన్నారు.

ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకున్న వారు ఆ ప్రైవేట్ విద్యా సంస్థలపైన విద్యాశాఖ మండల అధికారులతో పాటు, ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, బాలల హక్కుల కమిషన్ కు పిర్యాదు చేయవలెనన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 1902 (కాల్ సెంటర్), 1098 (నేషనల్ చైల్డ్ హెల్ప్ లైన్), ప్రవీణ్ ప్రకాశ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, విద్యా శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి 0863-2444270, 9013133636. ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్ 9849909105 కు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదులు ఇవ్వవచ్చని. లేదా [email protected] కి మెయిల్ చేయవచ్చునని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement