అమరావతి – ఏలూరు కార్పోరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సింగిల్ బెంచ్ ఆదేశాలు కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టి వేసింది.. అయితే ఫలితాలు ప్రకటించవద్దని ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది.. దీంతో రేపు జరిగే పోలింగ్ కు ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు అధికారులు.. కాగా ఏలూరు శివార్లలోని ఏడు గ్రామాలను కార్పొరేషన్ లో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో ఆ ఏడు గ్రామాలలో కూడా కార్పొరేషన్ ఎన్నికల జరగనున్నాయి.. అయితే ఈ గ్రామంలోని ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, అలాగే వీలిన నిర్ణయంపై గ్రామ సభ అభిప్రాయాలు తీసుకోలేదని కొందరు హైకోర్టు ను ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపి ఎన్నికలు జరిపి ఎన్నికలను నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. దీనిపై డివిజన్ బెంచ్ కు అప్లై చేసుకోగా ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement