Wednesday, November 20, 2024

మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి

ప్రకాశం జిల్లా మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి పలు పార్టీలకు చెందిన నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయడం ప్రభుత్వ అజ్ఞానానికి నిదర్శనమని మార్కాపురం జిల్లా సాధన సమితి సభ్యులు విమర్శించారు. సోమవారం మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ తో స్ధానిక అంబేడ్కర్ విగ్రహం నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యార్జీలతో నిరసన తెలిపారు. అనంతరం స్ధానిక తాహసిల్ధార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సాదన సమితి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి 20 సంవత్సరాలకు  జనాభా గణన ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తూ ఉంటుందని అన్నారు. వాటి ఆధారంగా జిల్లాల ఏర్పాటు అనేది సహేతుకం కాదని, శాస్త్రీయత ఏమాత్రం లేదని విమర్శించారు. పిఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను, గుడివాడలో మంత్రి కొడాలి నాని నిర్వహించిన క్యాసినో వ్యవహారం నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం అర్ధరాత్రి పూట జిల్లాల విభజన అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చిందని విమర్శించారు. జనాభా గణన పూర్తి అయ్యేవరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement