హైదరాబాద్ – తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.. ఐపిఎస్ రంగనాథ్ సారధ్యంలో హైడ్రా ఏర్పాటు చేసి మంచిపని చేశారంటూ కితాబు ఇచ్చారు.. విజయవాడలో నేడు పవన్ మీడియాతో మాట్లాడుతూ, చెరువులలోనే ఇళ్లు కడితే నీళ్లు ఎక్కడికి వెళతాయని ప్రశ్నించారు.. హైడ్రా ఏర్పాటుతో హైదరాబాద్ లోని చెరువులకు చెర వీడుతుందంటూ వ్యాఖ్యానించారు. అసలు అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకుంటే.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. హైడ్రాలాంటివి కచ్చితంగా ఉండాలని అన్నారు. ఎపిలో కూడా అటువంటి వ్యవస్థ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని అన్నారు పవన్ కల్యాణ్.
Advertisement
తాజా వార్తలు
Advertisement