Saturday, November 23, 2024

AP | సంక్షేమ రాజ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యం… విజయవాడ ఎంపీ అభ్యర్థి భార్గవ్

ప్రభ న్యూస్, మైలవరం : బీజేపీతో అంట కాగుతున్న తెలుగుదేశం వైసిపి పార్టీలకు ఓటు వేయవద్దని విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన మీ ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని వైస్సార్ కాలనీ, గొల్లపూడి, కొండపల్లి మునిసిపాలిటీ లలో విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, మైలవరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొర్రా కిరణ్, సిపిఎం జిల్లా నాయకులు పీవీ ఆంజనేయులు ఆదివారం విస్తృత ప్రచారం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 9 గ్యారెంటీలతో ప్రచారం చేస్తూ కాంగ్రెస్స్ పార్టీ హామీ ఇస్తే చేసి చూపిస్తదనీ వల్లూరు భార్గవ్ బొర్రా కిరణ్ లు ఒటర్ లకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళల కు మహిళా మహాలక్ష్మి పధకం క్రింద ఒక సం నికి ఒక లక్ష రూపాయలు (ప్రతి నెల నేరుగా వారి ఖాతా లోకి 8,333/- రూ లు ) ఇస్తామని తెలిపారు.

వైస్సార్సీపీ, టీడీపీ కి ఎవరకి ఓటు వేసిన బీజేపీ ఖాతా లోకి ఆ ఓటు వెళ్తుందనీ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, అసెంబ్లీ అభ్యర్థి బొర్రా కిరణ్ లు వివరించారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసిన బీజేపీ తో ప్రధాని మోడీ తో అధికారంగా బాబు, అనధికారికంగా జగన్ జత కట్టి ప్రజలను మోసం చేస్తారా అని ప్రశ్నించారు.

బీజేపీ తో అంటకాగుతున్న ఆ ఇద్దరును నమోద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తద్వారాన్ని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో గ్రామ గ్రామాన కాంగ్రెస్ కు ప్రజల నుంచి ఆదరణ లభించింది.

- Advertisement -

నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ ప్రచారంలో పీసీసీ ప్రధాన కార్యదరిసి లు మేడ సురేష్, నాగూర్, బైపుడీ నాగేశ్వరరావు, సర్పంచ్ గొంది సురేష్, కాండ్రకొండ అప్పారావు, మండెపూడి సునీత, ప్రమీళగాంధీ, లీగల్ చైర్మన్ శాస్త్రి, దున్నపోతుల శ్రీను, అక్కల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement