Thursday, January 9, 2025

Welcome Sir – ప్రధానికి హృదయపూర్వక స్వాగతం … ప‌వ‌న్ ట్విట్

విశాఖ‌ప‌ట్నం – నేడు ఏపీలోని విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులను సైతం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగలో ప్రధాని మోడీ హాజరై ఏపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ చొరవతో ఏపీ అభివృద్ధివైపు పరుగులు పెడుతోందన్నారు. ‘ప్రధానికి హృదయపూర్వక స్వాగతం. ఏపీ ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈరోజు విశాఖ కేంద్రంగా “దక్షిణ కోస్తా రైల్వే జోన్” కేంద్ర కార్యాలయం ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే పూడిమడకలో రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో ఎన్ టి పి ఎస్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ప్రాంతంలో రూ.1,877 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్ లకు శంకుస్థాపన చేస్తానని’ వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement