Monday, January 20, 2025

WEF 2025 – నేటి నుంచి దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు – హాజరుకానున్న ఎపి, తెలంగాణ సీఎం లు

దావోస్ – స్వీట్జర్లాండ్ లోని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకి వేదిక కాబోతోంది. నేటి నుంచి 24 వరకూ జరిగే ఈ సదస్సులో. ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు..

అలాగే.. అన్ని దేశాల ప్రతినిధులూ వస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు తాము ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నదీ.. ప్రతినిధులు.. ఈ సదస్సులో చెబుతారు.

ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంలు.. వ్యాపార దిగ్గజాలతో సమావేశాలు పెట్టుకొని.. ఏపీ, తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించబోతున్నారు.

- Advertisement -

తెలంగాణ టార్గెట్:

తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోంది. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ ఉంది. దీనికి పక్కనే ఫోర్త్ సిటీని డెవలప్ చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అక్కడే స్కిల్ ఇండియా యూనివర్శిటీని కూడా తెస్తున్నారు. తద్వారా స్కిల్ పొందిన వారంతా.. ఫోర్త్ సిటీలోకి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమల్లో.. ఉపాధి అవకాశాలు పొందగలరనేది ప్లాన్.

ఇప్పటికే సింగపూర్‌లో మూడు రోజులు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.. ఆల్రెడీ సింగపూర్ నుంచి భారీగా పెట్టుబడులను రాబట్టారు. అదే విధంగా.. దావోస్ పర్యటనలోనూ రాబట్టేలా ప్లాన్ ఉంది. రాత్రి దావోస్ బయలుదేరిన రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు బృందం, 3 రోజులపాటూ.. దావోస్ లోనే ఉంటుంది. తెలంగాణ రైజింగ్ నినాదంతో ఈ బృందం పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. వివరించబోతోంది సీఎం రేవంత్ రెడ్డి టీమ్..

ఆంధ్రప్రదేశ్ టార్గెట్:

అటు అమరావతి, ఇటు విశాఖకు భారీగా పెట్టుబడులు రాబట్టేలా ఏపీ ప్రభుత్వ ప్లాన్ ఉంది. ఆల్రెడీ కొన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పాలన గాడిన పడుతోంది. అందువల్ల దావోస్ టూర్ ఏపీకి కీలకంగా మారింది. పక్కనే ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆల్రెడీ డెవలప్ అవ్వడంతో.. అవి పెట్టుబడుల్ని ఇట్టే రాబడుతున్నాయి.

వాటి పోటీని తట్టుకొని ఏపీకి పారిశ్రామిక వేత్తలు రావాలంటే.. ఇది పెద్ద సవాలే.బ్రాండ్ ఏపీ పేరుతో సీఎం చంద్రబాబు టీమ్ దావోస్‌లో పర్యటించనుంది. ఇదివరకు ఇలాగే చంద్రబాబు విదేశాల నుంచి పెట్టుబడులను బాగా ఆకర్షించారు. ఇప్పుడు కూడా.. ప్రభుత్వ రాయితీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మానవ వనరులు, మౌలిక సదుపాయాలను వివరించి.. పెట్టుబడులను ఆకర్షించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు.

సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్:

ఇవాళ జ్యురిచ్‌లో ఇండియన్ అంబాసిడర్‌తో భేటీ అయ్యే సీఎం చంద్రబాబు.. తర్వాత హిల్టన్ హోటల్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. తర్వాత హయత్ హోటల్‌కి వెళ్లి.. తెలుగు పారిశ్రామిక వేత్తలతో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పొరాలో పాల్గొంటారు.

తర్వాత 4 గంటలపాటూ రోడ్డుపై ప్రయాణించి.. దావోస్ చేరుకుంటారు. రాత్రికి మరికొంతమంది పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్‌లో పాల్గొని, ఏపీలో పెట్టుబడులు పెట్టమని కోరతారు.

మంగళవారం.. సీఐఐ సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్ టాపిక్‌పై జరిగే చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే.. కోకాకోలా, ఎల్‌జీ, సిస్కో, వెల్‌స్పన్, సోలార్ ఇంపల్స్, వాల్ మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్, కార్ల్స్ బర్గ్ తదితర కంపెనీల చీఫ్ లతో చంద్రబాబు భేటీ అవుతారు.

అలాగే మూడో రోజు బుధవారం కూడా భేటీలుంటాయి. నాలుగో రోజు మాత్రం.. దావోస్ నుంచి తిరిగి జ్యురిచ్ వెళ్లి.. అక్కడి నుంచి ఇండియా, ఏపీకి వస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement