తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లిన ఆయన సోదరి షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అన్న జగన్ను, ఒదిన వైఎస్ భారతిని కుటుంబ సమేతంగా కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియకు ఫిబ్రవరి 17న వివాహం ఫిక్స్ అయిందని కుటుంబ సమేతంగా హాజరుకావాలని జగన్ను ఆహ్వానించారు. అలాగే ఈ నెల 18న జరిగే ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సైతం రావాలని షర్మిల కోరారు.
కాగా, అంతకుముందు షర్మిల స్పెషల్ ఫ్లైటులో కడప నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడ నుంచి వాహనంలో తాడేపల్లికి వెళ్లారు. అనంతరం సీఎం జగన్ను కలిశారు.
కాగా చాలా రోజులుగా సోదరుడు వైఎస్ జగన్ను షర్మిల కలవలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో కూడా విడివిడిగా పాల్గొన్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ స్థాపించినప్పటి నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో షర్మిల భేటీ కావడం ఇది తొలిసారి. అయితే ఇంటిలో వివాహకార్యక్రమం ఉండటంతో దాని కోసమే జగన్ ను కలిశారని, ఇందులో రాజకీయ అంశాలు ఏవీ లేమని ఆమె అభిమానులు అంటున్నారు.. కాగా, షర్మిలతో పాటు వైసిపిని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా జగన్ నివాసానికి వెళ్లడం విశేషం..