హైదరాబాద్ – ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హైదరాబాదులో పలు వివాహాలకు హాజరయ్యారు. మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు… ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ కుమారుడు శ్రీనిష్ పెళ్లిలోనూ సందడి చేశారు. నూతన వధూవరులు ఐశ్వర్య, శ్రీనిష్ లకు ఆశీస్సులు అందజేశారు. ఈ పెళ్లికి తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి వచ్చిన చంద్రబాబు… కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, లింగమనేని రమేశ్ కుమారుడి వివాహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సతీసమేతంగా విచ్చేశారు. పవన్, అన్నా లెజినోవా దంపతులు నూతన వధూవరులకు దీవెనలు అందజేశారు. ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు