Weather: నైరుతి రుతుపవనాలు నెమ్మదించాయి. దేశం నుండి దాదాపు ఉపసంహరించుకుంటున్నట్టే.. అయితే.. ఇప్పుడ మరో ప్రాబ్లం రాబోతోంది. ఈశాన్య రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి.. దీంతో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల వర్షాలు పడవచ్చు, కానీ, వర్షపాతం గురించి ఇంకా స్పష్టమైన అంచనా లేదు.
రానున్న 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రారంభంలో కాస్త నిదానంగా ఉన్నా.. మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ రాష్ట్రాల్లో అక్టోబర్ 30 వరకు వర్షాలు..
అక్టోబరు 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 29, 30 తేదీల్లో దక్షిణ అంతర్భాగమైన కర్నాటక, రాయలసీమలో భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అక్టోబర్ 28, 30 మధ్య భారీ వర్షాలు కురిసే చాన్సెస్ ఉన్నాయి.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 30 వరకు కేరళ, కోస్తా, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కూడా మేఘాలు ఆవరించనున్నాయి.