Thursday, December 26, 2024

Weather Report – తీవ్ర అల్పపీడనం – భారీ వర్షాలతో పాటు పిడుగులు ప‌డే చాన్స్‌

ప‌లు జిల్లాల్లో భారీ వర్షాలు
పిడుగులు ప‌డే చాన్స్‌ ఉందన్న అధికారులు
ఏపీలో మూడు రోజుల‌పాటు వాన‌లే
తెలంగాణ‌లో మారిన వాతావ‌ర‌ణం
అడ‌పాద‌డ‌పా కురుస్తున్న చిరు జ‌ల్లులు
మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్లొద్ద‌ని అధికారుల సూచ‌న‌
అన్ని పోర్టుల‌లో మూడో నెంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రిక‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌:

ఏపీలోని నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర భారతదేశం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి ఈ అల్పపీడనంతో పాటు తేమను తనవైపు లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ బుధవారం కల్లా క్రమంగా బలహీనపడుతోంద‌ని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరోక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంద‌ని అధికారులు తెలిపారు.

మూడు రోజులు వర్షాలు

- Advertisement -

అల్ప‌పీడ‌నం ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఇండియన్​ మెట్రోలాజికల్​ డిపార్ట్​మెంట్​ పేర్కొంది. బుధవారం నుంచి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

పోర్టులకు ప్రమాద హెచ్చరికలు..
ఏపీలోని దాదాపు అన్ని పోర్టుల్లో మూడో నెంబరుపై ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం (డిసెంబరు 28) తర్వాత రాష్ట్రంలో వర్షాలు త‌గ్గే అవ‌కాశాలున్నాయ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌.. మంగ‌ళ‌వారం తూర్పుగోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు తదితర జిల్లాల్లో కాస్తా తేలికపాటి వర్షాలు కురిశాయి. చలిగాలులు కూడా వీచాయి. అల్పపీడనం తీరానికి సమీపంలోనే ఉండడంతో సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘాలతో నల్లగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. నందిగామ, గన్నవరం, ళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గాయి.

ఏపీ, తెలంగాణ‌లో త‌గ్గిన టెంప‌రేచ‌ర్లు..
దాదాపు 10 నుంచి 15 రోజులుగా అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అల్పపీడన ప్రభావంతో ఉదయం పూట ఆకాశం మేఘాలమయం కావడంతో సూర్యుడు కనిపించడం లేదు. వాతావరణంలో మార్పుల‌తో చాలా మంది శ్వాసకోశ‌ బాధలతో ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement