Monday, November 18, 2024

Weather Report – బి అల‌ర్ట్ … ఎపికి మ‌రో వాయు”గండం”

బంగాళ‌ఖాతంలో మ‌రో వాయిగుండం ఏర్ప‌డింది.. ప‌స్తుతం పశ్చిమ వాయువ్యదిశగా ఇది కదులుతున్నది. దక్షిణ ఒడిస్సా, దక్షిణ ఛత్తీస్గడ్, విధర్భ మీదుగా రాగల 12 గంటల్లో ప్రయాణించి బలహీనపడనుంది. గడచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం..జగదల్‌పూర్‌కు పశ్చిమంగా 40 కిలోమీటర్లు, మల్కనగిరికి 50 కిలోమీటర్లు, విశాఖకు 170 కిలోమీటర్లు, కళింగపట్నంకు 220 కిలోమీటర్లు, రామగుండంకి తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

వాయుగుండానికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంద్రకు ఈ నెల 5 వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు.. అత్యధికంగా 65 కిలోమీటర్లు గాలులు వీస్తాయంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్‌, 22 జిల్లాలకు ఎల్లో జారీ అయ్యింది. గంటకు 55 కి.మీ వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement