ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. తమిళనాడు తీరానికి దగ్గరగా శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంనకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
రాగల 3-4 రోజులలో ఈ అల్పపీడనం పశ్చిమ దిశలో నెమ్మదిగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం:
ఈరోజు, రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలుంటాయని అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా:
ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉంటాయి. ఎల్లుండి కూడా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి.
రాయలసీమ:
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.