Friday, November 22, 2024

Weather Alert: నైరుతీ ఎఫెక్ట్.. రేపు, ఎల్లుండి మోస్త‌రు వ‌ర్షాలు

నైరుతి రుతుపవనాల తిరోగమనం బాట పట్టాయి. దీంతో ఏపీ, తెలంగాణ‌లో ఈ రెండు మూడు రోజుల్లో మోస్త‌రు జ‌ల్లులు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో.. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో.. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

తిరోగమన రేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, న‌ల్ల‌గొండ‌, బాగల్కోట్, వెంగూర్ల ప్రాంతాల మీదుగా కొన‌సాగుతోంది. అక్టోబర్ 23న‌ ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, మొత్తం ఉత్తర బంగాళాఖాతం ప్రాంతం, పశ్చిమ బెంగాల్ లోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలోని మిగిలిన భాగాలు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మొత్తం గోవా, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు సహా మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాల మీదుగా నైరుతి రుతుపవనాలు తిరోగమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతవరణ శాఖ అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement