పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా పయనించి ఈనెల 24 నాటికి ఉత్తర తమిళనాడు & దక్షిణ కోస్తా దగ్గర నైరుతి బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉంది. అయితే, దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు..
రేపు (సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- Advertisement -
ఇక మంగళవారం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.