Wednesday, October 9, 2024

AP | గెలిచేది మనమే.. అందరికీ ప్రాధాన్యం: పవన్ కల్యాణ్


(రాజమహేంద్రవరం, ప్రభన్యూస్ బ్యూరో) – అసెంబ్లీలో అడుగుపెట్టటమే.. లక్ష్యం, ఇందుకు త్యాగాలు తప్పవు, అధికారంలోకి వచ్చేది మనమే..పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది, ఎవ్వరికీ అన్యాయం జరగదు. మనకు ఉన్న లక్ష్యం ఒకటే.. అసెంబ్లీ మన గళం వినిపించటమే అని జన సైనికులకు జనసేనాని ఉద్బోధించారు. జనసేన అధ్యక్షుదు పవన్ కళ్యాణ్ మంగళవారం రాజమండ్రిలోని పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఈ సమావేశం ప్రారంభం కాగా.. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజక వర్గాల ముఖ్య నాయకులతో పవన్కళ్యాణ్భేటీ అయ్యారు. ఆయా నియోజవర్గాల్లో ఉమ్మడి పార్టీలు జనసేన, టీడీపీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

కీల‌క నేత‌ల‌తో జ‌న‌సేనాని భేటీ

ప్రతి నియోజకవర్గం నుంచి 15 మంది పైగా జనసేన నాయకులపు పిలిపించి పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా సమీక్ష జరిపారు. ఈ ఎన్నికల్లో గెలిచేది మనమే, సీట్లు రాలేదని బాధవద్దు. అధికారంలోకి వస్తాం. కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం ఖాయం, నామినేటెడ్ పదవుల్లో జనసైన్యానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ హితబోధ చేసినట్టు సమాచారం. అదే విధిగా ఉమ్మడి పార్టీల విజయంలో జనసైన్యం కీలక పాత్రను , ఎన్నికల విధి విధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల బాధ్యతలను కీలక నేతలకు అప్పగించినట్టు సమాచారం. రాజమండ్రి రూరల్​ నియోజకవవర్గంలో జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉందని సంకేతాలను పవన్ కళ్యాణ్ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

త్వ‌ర‌లో ఢిల్లీకి.. అక్క‌డే నిర్ణ‌యం

22 న ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ అనంతరం అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని పవన్ క‌ళ్యాన్ ప్ర‌క‌టించిన‌ట్టు తెలిసింది. భీమిలి, పెందుర్తి, యలమంచిలి, గాజువాక నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం గణనీయ ప్రభావం చూపింది. ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి, యలమంచిలిలో పోటీ చేస్తే గెలుపు ఖాయమని జనసైనికులు లెక్కలేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారనే కారణంతో తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.

విశాఖలోనూ భేటీలు..

విశాఖపట్టణంలో సోమవారం ఇదే రీతిలో నాయకులతో పవన్కళ్యాణ్మాట్లాడారు. విశాఖ జిల్లాలో 4 నియోజకవర్గాలకు అనధికారికంగా ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్‌, గాజువాకకు సుందరపు సతీష్‌, పెందుర్తిలో పంచకర్ల రమేష్‌, యలమంచిలిలో సుందరపు విజయ్‌ కుమార్‌ను నియమించారు. అధికారికంగా అభ్యర్థులు బదులు ఈ 4 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు. విశాఖజిల్లాలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు నియోజవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందనే సంకేతాలు కనపడుతున్నాయి. ఇక బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ తమ నేతలతో భేటీ కానున్నారు. తాను భీమవరం నుంచే పోటీ చేస్తాననే సంకేతం ఇస్తారని కార్యకర్తలు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం గాజువాకలో పవన్ పోటీ చేయరని ఇప్పటికే జనసైనికులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement