Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | అన్నదాతకు అండగా ఉంటాం… వైసీపీ భారీ ర్యాలీ

AP | అన్నదాతకు అండగా ఉంటాం… వైసీపీ భారీ ర్యాలీ

0
AP | అన్నదాతకు అండగా ఉంటాం… వైసీపీ భారీ ర్యాలీ

నంద్యాల బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి అనే భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల బీజేంద్రా రెడ్డి, నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ధార సుధీర్, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, ప్రజా ప్రతినిధులు, రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నూనెపల్లె ఉదయానంద హోటల్ నుండి భారీ ర్యాలీగా తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ… అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలను కల్పించి ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత 2019-24 సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించి, అధిక ధరలతో ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం 50 లక్షల మంది రైతులకు ఏడాదికి 1200 కోట్ల రూపాయలతో ఉచిత భీమా పథకాన్ని అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల ఎక్కడ అంటూ ప్రశ్నించారు. వైసిపి పార్టీ ఎల్లప్పుడు రైతుల పక్షాన నిలబడుతుందన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలని బాధ్యతలను గుర్తు చేస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

Exit mobile version