తనకు భద్రత పునరుద్ధరించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు (బుధవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
జగన్ కు కండిషన్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్నే ఆయనకు కేటాయిస్తామని వివరణ ఇచ్చింది. జగన్ భద్రతా సిబ్బంది సమాచారం ఇస్తే జామర్ వెయికిల్ ఇస్తామని తెలిపింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి స్పేర్ పార్ట్స్ ఆర్డర్ చేశాం కానీ అవి ఇంకా రాలేదు… వాహనం రిపేర్ అయ్యే వరకు జగన్ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తామని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
దీంతో రెండు వారాల్లో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించిన న్యాయస్థానం.. మూడు వారాల్లో పిటిషనర్‌ను కూడా రీజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది.తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.