Sunday, December 29, 2024

AP | యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.. ఎంపీ కేశినేని

  • ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యవస్థలు…
  • పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలు..
  • ఏపీ వైపు చూస్తున్న ఐటీ కంపెనీలు…
  • విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్..
  • మెగా జాబ్ మేళాకు అనూహ్యస్పందన…
  • 5వేలకు పైగా రిజిస్ట్రేషన్లు..


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు నిర్విరామంగా కృషి చేస్తున్నారని, ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ఏపీ ఐటీ హబ్ గా మారుతున్న తరుణంలో కంపెనీలన్నీ ఏపీకి వచ్చేందుకు క్యూ క‌డుతున్నాయని చెప్పారు. విజయవాడలోని మొగల్రాజపురంలో ఉన్న సిద్ధార్థ కళాశాల మెగా వికసిత్ జాబ్ మేళాను శనివారం నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు రాష్ట్రం న‌లుమూలల‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 60కంపెనీలు పాల్గొనగా, ఉద్యోగాల కోసం సుమారు 2000మంది ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా, జాబ్ మేళా వద్ద 3వేలకు పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాబ్ మేళాను ఎంపీ కేశినేని శివనాథ్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మన రాష్ట్రం వెనుక‌బ‌డి ఉంది.. కానీ మన అదృష్టం సీఎంగా చంద్రబాబు వున్నారని, విజన్ 2020అంటే నవ్వారని, ఆ ఫలాలు ఇప్పుడు హైదరాబాద్ అనుభవిస్తుందన్నారు. విజన్ 2047లో భాగంగా ఐటీ కంపెనీలు ఏపీకి వచ్చేందుకు క్యూ కడుతున్నాయన్నారు. దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. పెట్టుబడులు ఆకర్షించుకునేందుకు జనవరి 5వ తేదీన ఎంఎస్ఎంఎ అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. మీరు పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే దానికి ఏవిధంగా డీపీఆర్వోలు తయారు చేయాలనేది అవగాహన కల్పిస్తామ‌న్నారు. ప్రస్తుతం జరుగుతున్న జాబ్ మేళా రీతిలోనే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామ‌న్నారు. కేవలం ఐటీ వాళ్ళకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. యువతను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నమ్ముతారని, సీఎం ఆలోచనలో భాగంగానే ఈ మెగా వికసిత్ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పిన ఆయన మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి యువతకి జాబ్ ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. యువతకి ఇది మంచి అవకాశమ‌ని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -

ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రం విడిపోయినప్పుడు మన సీఎం కృషి అమోఘమ‌న్నారు. మన రాష్ట్రంలోనే ఐటీ ఉద్యోగాలు వుండాలని సీఎం ఆనాడే భావించారని, దీనిలో భాగంగానే హెచ్సీఎల్ ను మన రాష్ట్రంలోకి తీసుకువచ్చారన్నారు. వీటితో పాటు అనేక ఐటీ కంపెనీలను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఒక ఎంపీ యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేయటం మంచి పరిణామమ‌న్నారు. 3వేల మంది కి జాబ్ లు వచ్చే విధంగా జాబ్ మేళా ఏర్పాటు చేయటం సంతోషంగా వుందన్నారు. ఇప్పుడు జాబ్ రాని వారు బాధపడాల్సిన పని లేదని, ఇటువంటి జాబ్ మేళాలు మరిన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement