Saturday, November 23, 2024

AP | ఎన్డీఏతో ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామం : ప్రధాని మోదీ

ప్రాంతీయ ఆకాంక్షలు, దేశ ప్రగతి ప్రాతిపదికన ఎన్డీయే ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఏపీకి కేంద్రం ఎన్నో విద్యాసంస్థలను కేటాయించిందని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చాం.. తిరుపతిలో ఐఐటీ, ఐఎస్సార్‌, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఐఐపీఈ, ఎయిమ్స్‌ నిర్మించామని, విజయనగరం జిల్లాలో నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం’ అని మోడీ పేర్కొన్నారు.

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారు

ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని హెచ్చరించారు. టీడీపి వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ ను ప్రజాగళం సభలో ప్రధాని మోదీ తలచుకున్నారు. ‘శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే తెలుగునాట నందమూరి తారకరామారావు గుర్తొస్తారు అని గుర్తు చేశారు. పేదల కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, అందించిన సేవల్ని మనం కచ్చితంగా గుర్తుచేసుకోవాలి అని సూచించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారని ప్రధాని మోడీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని పదే పదే దెబ్బతీసిన విషయాన్ని మరచిపోకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement