Wednesday, October 16, 2024

AP: కుప్పంకు పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం : నారా భువనేశ్వరి

కుప్పం, జులై 23(ప్రభ న్యూస్ ): కుప్పంకు ప‌రిశ్ర‌మ‌లు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం మంగళవారం ఆమె విచ్చేశారు. మొదట శాంతిపురం మండలం వెంకటాపురంలో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గుడుపల్లి మండలం కుమ్మగుట్టపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లతో పాటు విశేష ఆహ్వానం పలికారు.

గత ఎన్నికల్లో ప్రచారంలో నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీ తెచ్చే గ్రామాన్ని దత్తత తీసుకొంటానని తెలియజేయడంతో మంగళవారం ఆమె కమ్మగుట్ట పల్లి బూత్ అత్యధిక మెజార్టీ రావడంతో ఆ గ్రామాన్ని దత్తత తీసుకొనేందుకు విచ్చేశారు. ఈ సందర్బంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ… కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కమ్మగుట్ట పల్లి గ్రామంలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. రాష్ట్రంలో జరిగిన అకృత్యలకు, దౌర్జన్యలను చుసిన మహిళలు కసితో టీడీపీకి ఓటేసి గెలిపించారని తెలిపారు. అలాంటి మహిళలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని నారా భువనేశ్వరి తెలిపారు.

అదేవిధంగా ప్రతి మహిళకు అండగా ఉండి స్వశక్తితో ఎదిగేలా అన్ని విధాలా ఉపాధి కల్పన కల్పించేందుకు చర్యలు తీసుకుం టామని ఆమె తెలిపారు. నిరుద్యోగులు బయట ప్రాంతాలకు ఉద్యోగం కోసం వెళ్లకుండా కుప్పంలోనే పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూడటమే కాకుండా వారు పదిమందికి ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంను నిర్వహించడం జరుగుతుందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భూములు అన్యాక్రాంతం కావడంతో అనేక భూసమస్యలు వస్తున్నాయని వాటికి సత్వర పరిస్కారం చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన బిడ్డ లాంటి వారని వారి ఎదుగుదల కోసం ఎంతవరకైనా పోరాడాతానని ఆమె అన్నారు.

- Advertisement -

దత్తత తీసుకున్న రెండు గ్రామాలతో పాటు నియోజక వర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రితో కొట్లాడైనా కుప్పం నియోజకవర్గంను కనీవినీ ఎరుగని రితిలో అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకొంటామని నారా భువనేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఇంచార్జి మునిరత్నం, డా.సురేష్ బాబు, మండల అధ్యక్షులు బాబు నాయుడు, మునిసిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement