Tuesday, November 19, 2024

KNL: మెగా డీఎస్సీ ఇవ్వకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం.. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

రాష్ట్రంలో ఖాళీగా 25వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీకి మెగా డీఎస్సీ ఇస్తానని ఎన్నికల ముందు చెప్పి నాలుగున్నర ఏళ్లుగా ఒక్క డీఎస్సీ, ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని మెగా డీఎస్సీ ఇవ్వకపోతే నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదని ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ద్రవిడ సురేష్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు హెచ్చరించారు.

ఇవాళ‌ బిర్లా గేటు నుండి కలెక్టరేట్ వరకు డీఎస్సీ అభ్యర్థులు భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటేన‌ని, నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికీ అందాలని పదేపదే చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలన్నారు.. ? అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక అర కొర పాఠాలు చెబుతున్నారని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అంటే ఇదేనా అని వారు ప్రశ్నించారు ..? ఇప్పటికీ అనేక మార్లు ఖాళీలు అడిగారు.. కానీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు.. ఒకసారి 5000 పైచిలుకు మరోసారి 8,000 పైచిలుకు మరోసారి 17,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు..

కానీ దానిపైన నిర్దిష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదు. అప్పుడేమో మెగా డీఎస్సీ చేసి అని చెప్పి నిరుద్యోగులను నట్టేట ముంచేసి ఇప్పుడు మినీ డీఎస్సీ అని చిలక పలుకులు పలుకుతున్నారని మెగా డీఎస్సీ ఇవ్వకపోతే నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదన్నారు. అమ్మ ఒడి విద్యాదేవన ఒకేసారి ఇవ్వకుండా నాలుగు విడతల్లో నాలుగు సార్లు బటన్ నొక్కుతున్నాడని, అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఒకే ఒక్కసారి బటన్ నొక్కితే ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. నిరుద్యోగులు ప్రజాప్రతినిధులను, పాలకపక్షాన్ని రాజకీయ నిరుద్యోగులుగా మార్చే శక్తి నిరుద్యోగులకే ఉందన్నారు. వెంటనే మెగా డీఎస్సీ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసి ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న, జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు బాబయ్య, నగర నాయకులు హుస్సేన్ భాష, రాంబాబు, నారాయణ, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement