Tuesday, November 26, 2024

జగన్ ప్రభుత్వం వైఫల్యంపై ఛార్జిషీట్ ప్రకటిస్తాం : జీవీఎల్

జగన్ ప్రభుత్వం వైఫల్యంపై ఛార్జిషీట్ ప్రకటిస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ… ప్రజాపోరు సభల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ప్రజలకు వివరించామన్నారు. వైసీపీ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ కార్యాచరణ సిద్ధం చేశామని, ఎక్కడికక్కడ పోరాటాలు చేసి, ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు. గన్నవరం విమానాశ్రయంలో స్థానిక పోలీసులతో రక్షణ ఎందుకని ప్రశ్నించారు.

టీడీపీ , వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక ఆరోపణలు వచ్చాయని, దీనిపై కేంద్ర విమానయానశాఖ మంత్రికి లేఖ రాశానన్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన తరువాత ప్రజల్లో మార్పు కనిపిస్తోందన్నారు. 2024లో ఏపీలో మోదీ మ్యాజిక్ పని చేస్తుందన్నారు. బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో అధికారంలోకి వస్తామన్నారు. అందరూ ఎదురు‌ చూసే భవిష్యత్తు బీజేపీ, జనసేనదేనని, వైసీపీ, టీడీపీలు రెండూ కుటుంబ, కుట్ర పార్టీలని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి ‌జరుగుతోందని ఆధారాలతో‌ చెబుతున్నామని జీవీఎల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement