Monday, November 18, 2024

AP | డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే… పవన్

  • గంజాయి, డ్ర‌గ్స్, నేరాలు అరిక‌ట్టాల్సిందే
  • గ‌త ప్ర‌భుత్వ నుంచి వార‌స‌త్వంగా కూట‌మి ప్ర‌భుత్వానికి..
  • దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలంటూ అమిత్ షాకు ప‌వ‌న్ ట్విట్


అమ‌రావ‌తి – ‘రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింద‌ని అన్నారు ఏపీ డిప్యూటీ సిఎం ప‌వ‌న్ కల్యాణ్.. గ‌త ప్ర‌భుత్వం నుంచి మన ఎన్డీఏ ప్రభుత్వానికి డ్ర‌గ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను వార‌స‌త్వంగా స‌క్ర‌మించాయ‌ని అన్నారు.. ఈ నేర సంస్క‌తిని, డ్ర‌గ్స్ మాఫీయాను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించి వేయాల‌ని కోరారు.. ఈ మేర‌కు ఆయ‌న నేడు ఎక్స్ లో ట్విట్ చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాని టాగ్ చేశారు..

కొంతకాలం క్రితం, విశాఖపట్నం పోర్టులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం సంచ‌ల‌నం క‌లిగింద‌న్నారు. అలాగే దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇది గత పాలనలో డ్రగ్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని చూపిస్తుందన్నారు పవన్‌.. ఈ నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అలాగే డ్ర‌గ్స్ మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కోరారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం డ్రగ్స్‌తో పాటు గంజాయి కట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే.. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా రాష్ట్రస్థాయిలో యాంటీ నార్కొటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఏఎన్‌టీఎఫ్‌), జిల్లాకొకటి చొప్పున మొత్తం 26 నార్కొటిక్స్‌ కంట్రోల్‌ సెల్స్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఉపసంఘం ఆమోదం తెలిపింది. డీజీపీ పర్యవేక్షణలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏఎన్‌టీఎఫ్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇక, మరోసారి డిప్యూటీ సీఎం డ్రగ్స్‌పై ట్వీట్‌ చేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం.. తర్వాత డ్రగ్స్‌, గంజాయి కట్టడిపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్న‌ట్లు వెల్ల‌డ‌వుతున్న‌ది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement