Tuesday, November 26, 2024

నాలుగేళ్ల‌లో ఒక్కో రైతుకు రూ.54వేలు అంద‌జేశాం.. సీఎం జ‌గ‌న్

ఏటీ ఒక్కో రైతుకు రూ.13,500ల చొప్పున నాలుగేళ్ల‌లో రూ.54వేలు రైతుల‌కు అంద‌జేశామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేశారు. వరుసగా నాలుగో ఏడాది మూడో విడ‌త వైయస్ఆర్ రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌మ చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో నిర్వహించిన కా­ర్య­క్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు.

ఈసంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామ‌న్నారు. వరు­సగా నాలుగో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించామ‌న్నారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను జమచేశామ‌న్నారు. అదేవిధంగా 2022 డిసెంబర్‌లో మాండూస్ తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతన్నలకూ రూ.76.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ మొత్తాన్ని రబీ సీజన్‌ ముగియక ముందే వారి ఖాతాల్లో జమచేస్తున్నామ‌న్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటివరకు 22.22 లక్షల మంది రైతన్నలకు రూ.1,911.78 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సి­డీని అందించామ‌న్నారు. ఇలా గడిచిన మూడేళ్ల తొమ్మిది నెలల్లో రైతులకు మొత్తం మీద నేరుగా రూ.1,45,751 కోట్ల లబ్ధిని చేకూర్చామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement