సీఎం జగన్ అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచారని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏ ఉద్యోగి రోడ్డు ఎక్కకుండానే 12వ పీఆర్సీని సీఎం జగన్ ప్రకటించారని పేర్ని నాని తెలిపారు. చంద్రబాబు ఏ రోజూ మేనిఫెస్టోను పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణను టీడీపీ పట్టించుకోలేదని వెల్లడించారు. చంద్రబాబు కుమారుడికి భద్రత కరువైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారన్న ఆయన మాజీ సీఎం కుమారుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
పాదయాత్ర చేస్తోన్న నారా లోకేష్ ప్రజా ప్రతినిధి కూడా కాదు.. చంద్రబాబు కుమారుడికి భద్రత కరవైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు పేర్ని నాని.. నోటికొచ్చినట్లుగా భద్రతా సిబ్బందిని లోకేష్ మాట్లాడుతున్నారు.. మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఇవ్వాల్సినంత దానికంటే ఎక్కువగానే భద్రతను ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు.. టీడీపీ వాళ్లే సెల్ఫీ ఇవ్వలేదని లోకేష్‌ను కోడిగుడ్లతో కొట్టారన్న ఆయన.. చంద్రబాబు కుమారుడికి బ్లాక్ క్యాట్ కమాండోలు ఇవ్వాలని అంటున్నారా? అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు.