Tuesday, November 26, 2024

49వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశాం : మంత్రి ర‌జిని

వైద్య ఆరోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేనంత‌గా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే వైద్య ఆరోగ్య రంగంలో 49వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గుర్తుచేశారు. విజ‌య‌వాడ‌లో మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయని, కోవిడ్‌ సమయంలో వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఇంకా మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్ధేశంతోనే రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

వైద్య, ఆరోగ్య రంగం పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు కల్పించేందుకు నిత్యం తపిస్తున్నారని తెలిపారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో వైద్యులు గొప్ప సేవలు అందిస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీలో అందించే చికిత్సలను పెంచామని, 3255 వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చారని, వైయ‌స్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. వైద్యానికి కావాల్సిన బడ్జెట్ పెంచాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేశారు. మెడికల్ కాలేజీలు తేవాలంటే చాలా ధైర్యం కావాల‌ని, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి సీఎం వైయ‌స్ జగన్ చరిత్ర సృష్టించార‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement