Monday, November 25, 2024

AP: కేసులు, అవమానాలు బూతులు భరించాం.. బుద్దా వెంక‌న్న‌

ఐదేళ్ల మా ఆవేదన గుర్తులేదా…
అప్పుడు చట్టాలు కనిపించలేదా..
సింహాలు పులులు అని, పిల్లుల్లా మారారు..
అధికార మదంతో విర్రవీగినాలకి శిక్ష తప్పదు..
ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు..
తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో) : గడిచిన ఐదేళ్లపాటు ఎన్నో కేసులు, అవమానాలు, వేధింపులు భరిస్తూ వచ్చామని, అప్పుడు చట్టాలపై గౌరవం ఉండి ధైర్యంగా ఎదిరించి నిలబడి పోరాడినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ఐదేళ్ల పాటు త‌మ ఆవేదన మీకు గుర్తులేదా అని ఆయన వైసీపీ నేతలను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల చిన్న సంఘటన జరిగితే దానిని భూతద్దంలో పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఆయన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ…. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసి పోయారన్నారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వస్తే వాళ్లకి తప్పు అని చెప్పలేదే అని అన్నారు. దాడులు చేయవద్దని త‌మ నాయకులు ముందే చెప్పారనీ, ఎక్కడో ఏదో‌ ఒక‌ ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాద్దాంతం చేస్తున్నారనీ తెలిపారు. ఈ ఐదేళ్లల్లో నువ్వు, మీ జగన్ మీ వాళ్ల నోళ్లు ఎందుకు అదుపు చేయలేదన్నారు. ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారనీ ఎద్దేవా చేశారు. విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర దోచేశాడన్నారు. వీటి పై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. నిజంగా తాము దాడులు చేయాలని అనుకుంటే… ఇలా ఉంటుందా పరిస్థితి అని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని త‌మ అధినేత ప్రకటించారనీ, అధినేత మాటకు కట్టుబడి కార్యకర్తలు, నాయకులు ఉన్నారని తెలిపారు.

- Advertisement -

జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగిందన్న ఆయన దానిని డైవర్ట్ చేయడానికే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడన్నారు. సింహాలు, పులులు అన్న వాళ్లు… అధికారం పోగానే పిల్లులు అయిపోయారా అని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన దేవినేని అవినాష్ కి గన్ మెన్లు ఇచ్చారనీ గుర్తు చేశారు. బూతులు తిట్టే నానిలకు, వంశీకి భద్రత పెంచింది మీరన్నారు. వల్లభనేని వంశీ మాత్రం మాట్లాడకూడని మాటలు మాట్లాడాడనీ, వంశీని మాత్రం వదిలే ప్రసక్తే లేదనీ.. శిక్ష పడాల్సిందేనన్నారు. అధికార మదంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంట్లో‌వాళ్లను తిట్టించారను, అప్పుడు మీకు వాళ్ల బాధ తెలియలేదా… చట్టాలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లల్లో తాము ధైర్యంగా పోరాడి నిలబడ్డాం అని గుర్తు చేశారు. మా చంద్రబాబు సవాల్ చేసి, సిఎం అయ్యాక అసెంబ్లీలో అడుగు పెడుతున్నారనీ, మీ అవినీతి, అక్రమాలపై‌ విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.


చంద్రబాబుకు ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చింది… జగన్ కు అదీ కూడా రాలేదన్నారు. మీకు సిగ్గు, శరం ఉంటే… వైసీపీని పూర్తిగా రద్దు చేయండన్నారు. విజయసాయి రెడ్డి నీ మాయమాటలు ఎవ్వరూ నమ్మరన్నారు. ధైర్యం ఉంటే వంశీని పిలిపించి పక్కన కూర్చో పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టు అని సవాల్ విసిరారు. మీ ఆగడాలను ఐదేళ్లు భరించాం… కేసులకు భయపడకుండా పోరాటాలు చేశాం అన్నారు. ఐదు రోజుల్లోనే ఫిర్యాదులు అంటూ హడావుడి చేస్తున్నారనీ, అధికార మదంతో అడ్డగోలుగా వాగిన వారు తప్పకుండా శిక్ష అనుభవించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement