Friday, September 20, 2024

AP | సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం : డిప్యూటీ సీఎం పవన్

సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని సి-కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు దార్శనికుడని… ఆయన న‌న్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసుకుందని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో పింఛన్ పంపిణీకి డబ్బులు లేవని.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పింఛన్లు పెంచి పంపిణీ చేశారన్నారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందేవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. నిర్జీవతముతున్న పంచాయతీలను ఆదుకుంటున్నామన్నారు. సీఎం చంద్రబాబు పంచాయతీలకు రూ.1,452 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు.

రాష్ట్ర అభివృద్ధి తమకు ముఖ్యమన్నారు. వైసీపీ సర్పంచ్‌లు ఉన్న పంచాయతీల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఇక అన్న క్యాంటీన్లపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోందనీ పేదల కడుపు నింపుతుంటే ఎందుకు అంత కడుపుమంట అన్నారు పవన్ కల్యాణ్. అలాగే గతంలో అన్నా క్యాంటీన్లను ఎందుకు మూసివేయాలని అనిపించందంటూ ప్రశ్నించారు. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులు కడుపునిండా భోజనం జరుగుతోందని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్‌ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement