Tuesday, November 26, 2024

కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుచేస్తాం – నారా లోకేష్

ఆదోని ( కర్నూలు జిల్లా ) ఆదోని నియోజకవర్గం కుప్పగల్లులో యువనేత లోకేష్ తో న్యాయవాదులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మేం జగన్ లా మాయమాటలు చెప్పి, మోసం చేసేవాళ్లం కాదు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హైకోర్టు వైజాగ్ లో అంటాడు, జగన్ రాయలసీమ లోనే హైకోర్టు అని మభ్య పెడుతున్నాడు.వైసిపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ లా కర్నూలులో ఒక మాట చెప్పి ఢిల్లీలో మరోమాట చెప్పే దుర్మార్గపు ఆలోచన నాకు లేదు. నాలుగేళ్లుగా మాయమాటలు చెబుతున్న జగన్ కర్నూలులో కనీసం స్థలం కేటాయించి, ఒక్క ఇటుక పెట్టాడా? జగన్ చెప్పే అబద్దాలు తియ్యగా, మేం చెప్పే నిజాలు చేదుగా ఉంటాయి. విజ్ఞులైన న్యాయవాదులు నిజానిజాలను గుర్తించాలి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని టిడిపి నిర్ణయం తీసుకుంది… అధికారంలోకి వచ్చాక ఏర్పాటుచేస్తాం. పరిపాలన అంతా ఒక చోట ఉండాలి, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్నది మా విధానం. న్యాయ విభాగానికి సరైన నిధులు, మౌలిక వసతులు కల్పించకుండా కేసులు పెండింగ్ లో ఉన్నాయని నిందించడం సబబు కాదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు ఎక్కువగా కేటాయించి, మౌలిక వసతులు మెరుగుపరుస్తాం. మీ వల్లే రాష్ట్రంలో జగన్ చేసిన అరాచకాలను కొంత వరకైనా అడ్డుకోగలిగాం. జూనియర్ లాయర్లకి స్టయిఫండ్ ఇస్తాం. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామని యువనేత లోకేష్ చెప్పారు.

ఆదోని సజ్జ రైతును కలిసిన లోకేష్

గణేకల్లు శివారులో యువనేత నారా లోకేష్ సజ్జచేలో దిగి రైతు కష్టాలను తెలుసుకున్నారు.• ఈ సందర్భంగా రైతు గోళ్ల నాగరాజు తమ గోడు విన్పిస్తూ నాకు ఎకరన్నర పొలం ఉంది.• నీటి సౌకర్యం లేకపోవడంతో ఆరుతడి పంటగా అరఎకరంలో సజ్జవేసి, మిగిలిన ఎకరం బీడుపెట్టాను.• నా పొలంలో బోరు ఉంది కానీ ట్రాన్స్ ఫార్మర్ లేదు.• కరెంటు ట్రాన్స్ ఫార్మర్ కోసం రూ.20వేలు డిడి కట్టి ఏడాది అయింది. ఎప్పుడు అడిగినా ఇంకా ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు.• సుమారు 2కిలోమీటర్ల నుంచి రూ.60వేలు ఖర్చుపెట్టి వైరు లాక్కుని నీళ్లకోసం అవస్థలు పడుతున్నాను.• అసలే వ్యవసాయం అంతంతమాత్రంగా ఉంటే, కరెంటు కనెక్షన్ కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోంది అంటూ తన గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై యువనేత లోకేష్ స్పందిస్తూ…*• రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల పుణ్యమా అని వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.• మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించాలని చూస్తున్నాడు.• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ట్రాన్స్ ఫార్మర్ ఇప్పించే ఏర్పాటుచేస్తామన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement