న్యూఢిల్లి, (ప్రభన్యూస్): భారతదేశ రాజధాని ఐన ఢిల్లి నగరం టాప్-10 ప్రపంచ కాలుష్య నగరాల్లో అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానానికి చేరింది. ఈ జాబితాలో ముంబై, కోల్‌కతా నగరాలు కూడా నమొదు అయ్యాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన క్లయిమేట్ గ్రూప్ ఎయిర్ క్వారిటీ ఇండెక్స్ (ఐక్యుఎ) జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్ ప్రతి ఏటా ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో వాయు నాణ్యతను, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంటుంది. క్లయిమేట్ గ్రూప్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో కూడా భాగస్వామిగా ఉంది.
ఐక్యుఏ సర్వీస్ ద్వారా జాబితా చేయబడిన సగటు ఏక్యుఐ 556తో ఢిల్లి అగ్రస్థానంలో ఉండగా, కోల్‌కతా నాల్గవ స్థానం, ముంబై ఆరవ స్థానంలో ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన జాబితాలో అధ్వానమైన ఎక్యుఐ సూచికలు ఉన్న నగరాల్లో టాప్-10లో పాకిస్తాన్‌లోని లాహోర్, చైనాలోని చెంగ్డు ఉన్నాయి. ఢిల్లి కాలుష్యానికి గల కారణాలను ఈ సర్వే అనేక కోణాల్లో విశ్లేషించింది. క్షీణిస్తున్న వాయు నాణ్యతే కారణమని, ముఖ్యంగా వాహనాల నుంచి వచ్చే పొగతోపాటు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల పరిస్థితి దిగజారిందని పేర్కొంది.
టాప్-10 కాలుష్య నగరాలు..
1) ఢిల్లిd – ఇండియా (ఎక్యుఐ:556), 2) లాహోర్- పాకిస్తాన్ (ఎక్యుఐ:354), 3) సోఫియా-బల్గేరియా (ఎక్యుఐ:178), 4) కోల్‌కతా – ఇండియ (ఎక్యుఐ177), 5) జాగ్రెబ్- క్రొయేషియా (ఎక్యుఐ173), 6) ముంబై- ఇండియా (ఎక్యుఐ 169), 7) బెల్‌గ్రేడ్-సెర్బియా (ఎక్యుఐ165), 8) చెంగ్డు – చైనా (ఎక్యుఐ165), 9)) స్కోప్జే- నార్త్ మెసడోనియా (ఎక్యుఐ164), 10) క్రాకోవ్ – పోలాండ్ (ఎక్యుఐ160).
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily