నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం బేతంచెర్లలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా (ఆన్ లైన్) ద్వారా 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ… అన్ని రంగాల్లో వెనుకబడ్డ నంద్యాల జిల్లాకు మీ సహాయ, సహకారం ఎంతో అవసరమని సీఎం చంద్రబాబును కోరారు. నాపరాతి పరిశ్రమలు అధికంగా ఉన్న బేతంచెర్ల ప్రాంతంలో నిత్యం విద్యుత్ లోవోల్టేజ్ సమస్య, కరెంటు కోత అధికంగా ఉండడం వల్ల నాపరాతి పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు ఇబ్బంది పడేవారన్నారు. 2018-2019 లో మీ చేతుల మీదుగా ఈ నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారన్నారు.
గత ఇదేళ్ళ వైసీపీ పాలనలో నిర్లక్ష్యం కాబడ్డ ఈ సబ్ స్టేషన్ కు మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేసి మీ చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విద్యుత్ కష్టాలు తొలగించిన మీకు బేతంచెర్ల ప్రాంతం రుణపడి ఉంటుందని సీఎం చంద్రబాబుకు ఎంపీ బైరెడ్డి శబరి చెప్పారు.