Friday, November 22, 2024

సీఎం నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉన్నాం : మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణపై మంత్రి బాలినేని

రాష్ట్ర‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో మంత్రులుగా ఉన్నవారిలో కొందరు కొనసాగుతారని… మంత్రి పదవి నుంచి తప్పించిన వారికి పార్టీ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై స్పందిస్తూ… కొత్త మంత్రివర్గ ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి నిర్ణయమని అన్నారు. ఆయన ఎవరు కావాలనుకుంటే వారు మంత్రులుగా ఉంటారని చెప్పారు. ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసేయాలో జగన్ కు బాగా తెలుసన్నారు. మంత్రివర్గాన్ని మారుస్తారనే విషయాన్ని తాను ఆరు నెలల క్రితమే చెప్పానని బాలినేని తెలిపారు. ఐదేళ్లు పాలించడానికే తమకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement