Saturday, January 4, 2025

Nandyala | శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం జనరేటర్ నుంచి నీరు లీక్..

పొంచి ఉన్న ప్రమాదం
నంద్యాల బ్యూరో, జనవరి 1 : రెండు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు జలాశయంలో ఏర్పడిన గందరగోళం ప్రమాదానికి సంకేతంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నా రు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయంలోని జల విద్యుత్ కేంద్రంలో ఉన్న జనరేటర్ నుంచి నీరు లీక్ అవుతున్నట్లు తెలుస్తుంది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలోని ఒకటో నెంబర్ జనరేటర్ నుంచి ఈ నీరు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.

గత వారం రోజులుగా యూనిట్ డ్రాప్స్ ట్యూబ్ జీరో రోడ్ నుంచి ఈ వాటర్ లీక్ అవుతున్నట్లు సమాచారం. పంప్ మోడ్ టర్బన్ వేగంగా తిరగటం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు ఇంజనీరింగ్ చెబుతున్నారు. అందులో నుంచి వచ్చే నీరు లీకేజీని ఆపకపోతే ఫ్లోర్ స్లాబ్ పడిపోవటం జరుగుతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.

ఫ్లోర్ స్లాబ్ పడిపోతే జనరేటర్ కూడా మునిగిపోయే ప్రమాదముంది. నీరు చాలా ఎక్కువగా వస్తోంది. గత రెండు నెలలుగా రాత్రింబవళ్లు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో నుంచి నిరంతరంగా విద్యుత్ కోసం నీరు పోవటంతో జనరేటర్ పై భాగం స్లాబ్ నుంచి నీరు నిరంతరంగా లీకేజీ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -

యుద్ధ ప్రాతిపదికన స్లాబ్ కు నీరు లీకేజీ కాకుండా మరమ్మతులు చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఇంజనీరింగ్ అధికారులు కష్టపడుతున్నప్పటికీ లీకేజీ నీరు ఆగకపోవటం విశేషం. నీరు లీకేజీ ఆపకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నా రు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement