Sunday, September 8, 2024

Viral: కరువు నేలలో నీటి జలధార.. చేతిపంపులు ఉబికి వస్తున్న నీరు

కరువుకు పెట్టింది పేరు రాయలసీమ జిల్లాలు. ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటేనే తీవ్ర వర్షాభావ పరిస్థితులు గుర్తుకొస్తాయి. అయితే ఇలాంటి ప్రాంతంలో భూమి నుంచి నీరు ఎగసి పడుతోంది. అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరం వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు.. గాడిదలకు పూజలు చేస్తారు. ఇళ్లలో ఉన్న పాత చాటలు, రోళ్ళు గ్రామ పొలిమేరలోకి తీసుకెళ్ళి అక్కడ పడవేసి పూజలు చేస్తారు. వెయ్యి నుంచి 1,500 అడుగుల బోర్లు వేసినా అందలో నీళ్లు పడక అప్పులపాలై వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీటికి మొహం వాచిన అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా జలధారలు కనిపిస్తున్నాయి.

నీళ్లు పడకుండా ఇంకిపోయిన బోర్లలో గత మూడు నెలలుగా నీళ్లు జలధార వస్తున్నాయి. ఓబులదేవరచెరువు మండలం తుమ్మలకుంట్ల పల్లి మారమ్మ దేవాలయం వద్ద చేతి పంపులో మూడు నెలలుగా ఏకధాటిగా నీళ్లు బయటకు వస్తున్నాయి. తమ జీవిత కాలంలో ఇలాంటి  దృశ్యం చూడ లేదని స్థానికులు చెబుతున్నారు. అతి కష్టం మీద అరగంట బోర్ కొడితే ఒక బిందె నిండే బోరులో నీళ్లు వస్తున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement