తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి హాస్టల్ వార్డెన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. నారాయణ కాలేజీలో CSC సెకండియర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా పులివెందులకు చెందిన ధరణేశ్వర్ రెడ్డి గా పోలీసులు తెలిపారు.
అయితే.. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని సహచర విద్యార్థులు వార్డెన్ శ్రీనివాసులు నాయుడుకు తెలిపారు. ఈ విషయం విన్న వెంటనే అతను షాక్ కు గురయ్యాడు. గుండెపోటు రావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించారు. కాగా, ట్రీట్మెంట్ జరుగుతుండగానే అతను చనిపోయాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.