నంద్యాల (పాములపాడు) : నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి జనాలను భయపెడుతోంది. దీనికోసం అటవీశాఖ అధికారులు స్పెషల్‌గా బోను ఏర్పాటు చేశారు. పాములపాడు మండలం ఎర్రగూడూరు శివారులో ఎలుగుబంటి సంచాంరంతో గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పది రోజుల క్రితం బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సమీపంలో ఒక మేకల కాపరిపై ఎలుగుబంటి దాడిచేయగా పక్కన ఉన్న రైతులు కేకలు వేయడంతో అది పరారైంది. అదే ఎలుగుబంటి ఎర్రగూడూరు గ్రామం సమీపంలో సంచరిస్తుండడంతో గ్రామస్తులు రాత్రిపూట బయటికి రావాలంటే భయాందోళనలు చెందుతున్నారు. ఆ ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక బోనులను కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్తులు రాత్రివేళ బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
- Advertisement -