అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 169 సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రేపు (మంగళవారం) వాకిన్ రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.
ఉదయం 10.30 గంటలనుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు వాకిన్ రిక్రూట్మెంట్ జరుగుతోందన్నారు. పోస్టుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు విజయవాడ, హనుమాన్ పేటలోని పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని వైద్య విద్యాశాఖ డైరెక్టర్(డిఎంఇ) కార్యాలయంలో జరిగే వాకిన్ రిక్రూట్మెంట్‌కు హాజరు కావాల్సిందిగా సూచించారు.
ఖాళీల వివరాలు
శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల్లో 9, విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల్లో 10, విశాఖపట్నం ఆంధ్రా వైద్య కళాశాలలో 5, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 10, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 10, కాకినాడ ప్రాంతీయ వైద్య కళాశాలలో 10, విజయవాడ సిద్ధార్ధ వైద్య కళాశాలలో 5, మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో 10, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 4, ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో 9, నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో 12, తిరుపతి శ్రీ వెంకటేశ్వరా వైద్య కళాశాలలో 7, కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 2, కర్నూలు వైద్య కళాశాలలో 10, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో 11, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో 10, మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో 3, కడప సూపర్ స్పెషాలిటీ- ఆస్పత్రిలో 9, కర్నూల్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో 16, పలాస సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 4, కడప సిసిసిలో 3 వంతున మొత్తం 169 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు నేడు వాకిన్ రిక్రూట్‌మెంట్ నిర్వహించనున్నారు.