ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదినాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ , అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ అభివృద్ధికై వాక్ విత్ వెలంపల్లి 2కె మారథాన్ ను స్థానిక భవానీపురం లో గల క్రాంబ్వే రోడ్ లో ఘనంగా నిర్వహించారు. వాక్ కి ముందుగా ఆటా పాటలతో విచ్చేసిన శ్రేణులను ఉత్తేజపరిచి వాక్ ని ప్రారంభించారు. వాక్ మధ్యలో వైయస్సార్ పార్క్ నందు ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ ను కట్ చేసారు. ఈ వాక్ లో వెలంపల్లి తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రాణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శైలజా రెడ్డి, తూర్పు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని వెలంపల్లి తో నడిచారు.
మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ వెలంపల్లి తో 2కె మారథాన్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్నేహితుడైన వెలంపల్లి రెండు సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా గెలుపొందారని రానున్న ఎన్నికలలో మూడో సారి అత్యధిక మెజారిటీతో గెలుపొందనున్నారని అన్నారు దానికి నిదర్శనమే ఈ 2కె రన్ అన్ని అన్నారు. ఇంత విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు అందరూ రానున్న ఎన్నికలలో ఉత్సాహం గా పని చేసి వెలంపల్లి గెలుపునకు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిత్యం ఆలోచించే జగనన్న బాటలో నడుస్తున్న వెలంపల్లి తో పార్టీ శ్రేణులు వేలాది మంది పాల్గొనడం సంతోషదాయకమన్నారు.
వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ నిర్వహించిన 2కె మారథాన్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో రానున్న ఎన్నికలలో ఉత్తేజంగా పని చేసి నియోజకవర్గంలో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో దుర్గ గుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు, తదితరులు పాల్గొన్నారు.