దేశం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అవినీతి అడ్డంకిగా మారిందని టిటిడి సివిఎస్వో గోపీనాథ్ జెట్టి అన్నారు. అవినీతిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు వారి స్థాయిలో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పిలుపుమేరకు మంగళవారం ప్రారంభమైన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం టిటిడి పరిపాలనా భవనం నుంచి అలిపిరి టోల్ గేట్ వరకు వాక థాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోపీనాథ్ జెట్టి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అలిపిరి టోల్ గేట్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టిటిడిలో భక్తులకు దర్శనం, వసతి, ప్రసాదాల పంపిణీ విషయాల్లో ఎక్కడైనా అవినీతి జరిగితే భక్తులు అధికారులకు తెలియజేయాలన్నారు. భక్తులకు అవినీతి రహిత సేవలు అందేలా విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పని చేయాలన్నారు. నవంబర్ ఒకటవ తేదీ స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ వారోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది చేత అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement